IND News

ఆగస్టు 10న సాగర్ లో వరుణ యాగం!

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణ యాగం

SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో

హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, కృష్ణా–గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవడంతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ ప్రాంగణంలో ఘనంగా వరుణ యాగం నిర్వహించనున్నారు.

ముఖ్యమంత్రి A. Revanth Reddy సూచనల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు యాగానికి ఆగస్టు 10వ తేదీని శుభముహూర్తంగా నిర్ణయించారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహాయాగంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు వేదోక్త విధానంలో యాగ క్రతువులను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రజలకు సకాలంలో వర్షాలు కురవాలని, వ్యవసాయం అభివృద్ధి చెందాలని, నదులు, జలాశయాలు, చెరువులు నిండాలని ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి N. Uttam Kumar Reddy సారథ్యంలో ఈ వరుణ యాగం నిర్వహించబడుతుంది.

సాయంత్రం జరిగే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top