(SN సింహ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో ) యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు రెవిన్యూ లో….. ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ IPS ఆదేశాల మేరకు డ్రగ్స్ అక్రమ రవాణాపై యాదాద్రి-భువనగిరి పోలీసుల భారీ ఆపరేషన్ నిర్వహించారు. బీబీనగర్ పోలీసులు – SOT సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు నిందితుల అరెస్ట్ రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనంయాదాద్రి-భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ IPS గారి ఆదేశాల మేరకు, జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ తయారీ, రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా బీబీనగర్ పోలీసులు మరియు SOT యాదాద్రి-భువనగిరి పోలీసులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 27 కిలోల నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్‌ను, సుమారు రూ.54 కోట్ల విలువైన మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు 08.08.2026న కొండమడుగు గ్రామ శివారులో ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, MH-49-CW-1313 నంబర్ గల ఫార్చ్యూనర్ కారును పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. వాహనంలో 27 కిలోల మెఫెడ్రోన్‌తో పాటు డ్రగ్ తయారీలో ఉపయోగించే సుమారు 40 కిలోల అసిటోన్ లిక్విడ్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. A1. చేతన్ మధుకర్ మెష్రామ్, వయస్సు 49 సంవత్సరాలు, నాగ్‌పూర్, మహారాష్ట్ర.పాత్ర: డ్రగ్ తయారీకి ఆర్గనైజర్ మరియు ఆర్థిక సహకారం అందించిన వ్యక్తి. A2. ముజామల్ హక్, వయస్సు 25 సంవత్సరాలు, మారిగావ్, అస్సాం.పాత్ర: డ్రగ్ తయారీలో సహకరించిన వ్యక్తి. A3. ఆకాశ్ అశోక్ గవాండే, వయస్సు 31 సంవత్సరాలు, నాగ్‌పూర్, మహారాష్ట్ర.పాత్ర: డ్రగ్ అక్రమ రవాణాలో సహకరించిన వ్యక్తి. A4. ఉపద్రష్ట రమణ మూర్తి, వయస్సు 65 సంవత్సరాలు, చందానగర్, హైదరాబాద్.పాత్ర: వేటుకూరి ల్యాబ్స్ ఇన్‌చార్జిగా వ్యవహరించిన వ్యక్తి. పరారీలో ఉన్న నిందితులు: A5. ఎం.డి. అయూబ్ అలీ – అస్సాంల్యాబ్ ఏర్పాటు, ముడి పదార్థాల సమీకరణ మరియు కెమిస్ట్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర. A6. చందా ప్రదీప్ ఠాకూర్ – నాగ్‌పూర్డ్రగ్ పెడ్లర్. A7. గోపాల్ సిర్పట్ పటేలియా – నాగ్‌పూర్డ్రగ్ పెడ్లర్. A8. యేటుకూరి రామరాజు – వేటుకూరి ల్యాబ్స్ యజమాని, పీర్జాదిగూడ, మేడిపల్లిల్యాబ్ యజమాని. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్నవి: కేసు వివరాలు: నిందితులను విచారించగా, 05.08.2026 నుంచి 07.08.2026 వరకు కొండమడుగు గ్రామంలోని వేటుకూరి ల్యాబ్స్‌లో ఇతర సహచరుల సహకారంతో మెఫెడ్రోన్‌ను అక్రమంగా తయారు చేసినట్లు వెల్లడించారు. తయారు చేసిన డ్రగ్‌ను కొండమడుగు నుంచి నాగ్‌పూర్‌కు తరలించి అక్కడ పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల సమాచారం మేరకు పోలీసులు వేటుకూరి ల్యాబ్స్‌కు వెళ్లి తనిఖీ చేయగా, డ్రగ్ తయారీలో ఉపయోగించిన రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం కంపెనీని చట్ట ప్రకారం సీజ్ చేయడానికి చర్యలు తీసుకోబడతాయి. ఈ మొత్తం ఆపరేషన్‌ను NDPS చట్టంలోని నిబంధనలను పాటిస్తూ, పంచుల సమక్షంలో మరియు చట్టపరమైన విధానాలను అనుసరిస్తూ నిర్వహించారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ IPS సందేశం: “యాదాద్రి-భువనగిరి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ తయారీ, రవాణా మరియు విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం మనందరి బాధ్యత. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.” ఈ ఆపరేషన్ శ్రీ బి. శ్రీనివాస్ నాయుడు, SDPO–యాదాద్రి డివిజన్, ఇన్‌చార్జ్ భువనగిరి డివిజన్ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. ఆపరేషన్‌లో శ్రీ టి. ప్రవీణ్ బాబు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, SOT యాదాద్రి-భువనగిరి, శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శ్రీ ఎస్. కృష్ణయ్య, ఎన్. రమేష్, ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం యాదాద్రి-భువనగిరి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు..