IND News

యాదగిరిగుట్ట సర్కిల్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆక్షాన్స్ యాదవ ఐపీఎస్.

(SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో)

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ గారు నేడు యాదగిరిగుట్ట సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి, కార్యాలయ నిర్వహణ, పరిపాలనా విధానాలు, నేరాల నమోదు, దర్యాప్తు పురోగతి, వివిధ రిజిస్టర్లు మరియు ఇతర అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీ సందర్భంగా యాదగిరిగుట్ట సర్కిల్ పరిధిలోని తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూరు, గుండాల పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, బీట్ వ్యవస్థ, విజిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీ, కమ్యూనిటీ పోలీసింగ్, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలకు నమ్మకమైన సేవా కేంద్రంగా ఉండాలని, ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

తనిఖీ అనంతరం కార్యాలయ నిర్వహణపై పలు సూచనలు చేస్తూ, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి శాఖా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి జోన్ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు యాదగిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ యాదగిరిగుట్ట సర్కిల్ పరిధిలోని తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూరు, గుండాల పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ అధికారులు మరియు సర్కిల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top