IND News

ప్రజల ప్రశంసలు అందుకుంటున్న యాదగిరిగుట్ట డీలర్ నాగేష్

యాదగిరిగుట్టలో ఇంటింటికి వెళ్లి కేవైసీ చేపిస్తున్న నాగేష్ డీలర్లును స్థానిక యాదగిరిగుట్ట ప్రజలు నగేష్ సేవలు అభినందిస్తున్నారు కేవైసీ చేసుకొని ఎడల మరి ఇంటికి వెళ్లి రేషన్ కార్డు లబ్ధిదారులను నమోదు చేయించడం జరుగుతుంది ఇప్పటికైనా కేవైసీ చేసుకోలేనివారు తిరిగి చేసుకోవాలని డీలర్ నాగేష్ కొడుతున్నారు. శభాష్ నాగేష్ డీలర్

ప్రజల ప్రశంసలు అందుకుంటున్న యాదగిరిగుట్ట డీలర్ నాగేష్ Read More »

కీసర రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య.

(SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు. సోమవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికి ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం అందించారు. అనంతరం శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సమృద్ధిగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆలయ అర్చకులు శ్రీ బీర్ల అయిలయ్య గారికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు గడిపి భక్తులతో ఆప్యాయంగా పలకరించారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలు, దేవాలయాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా శ్రీ బీర్ల అయిలయ్య గారు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే, దైవానుగ్రహం కోసం తరచూ ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

కీసర రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య. Read More »

నారగుట్టపై క్రషర్ అనుమతులు రద్దు చేయాలి JAC

(SN. సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో) యాదాద్రి భువనగిరి జిల్లా నమాత్ పల్లె నారగుట్ట వద్ద జరిగిన జేఏసీ సమావేశంలో నాలుగు గ్రామాల ప్రజలు రద్దు చేయాలని తీర్మానం చేశారు…… నారగుట్టపై క్రషర్ ఏర్పాటు చేయొద్దు తుక్కాపురం గ్రామంలో నారాగుట్ట సమీపంలో 119&139 సర్వే నెంబర్లు నిర్వహిస్తున్నటువంటి R. K స్టోన్ ఇండస్ట్రీ కీ వ్యతిరేకంగా క్రషర్ వ్యతిరేక జేఏసీ(JAC )ఆధ్వర్యంలో నారగుట్ట పరిరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి JAC కన్వీనర్ పుట్ట వీరేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ఆర్కె స్టోన్ ఇండస్ట్రీ క్రషర్ పర్మిషన్ ని వెనక్కి తీసుకోవాలని నారాగుట్ట పైన చిదురుగా ఉన్న ప్రదేశాన్ని ప్రభుత్వం కలెక్టర్ గారు నివాస గృహాలకు మరియు గురుకుల స్కూళ్లకు హాస్టల్ ప్రభుత్వ కాలేజీలకు ప్రభుత్వ ఆఫీసులకు అనుగుణంగా ఉన్న భూమిని క్రషర్కు పర్మిషన్లు ఇవ్వడం అనేది ఈ జిల్లాకు ఇక్కడున్న ప్రజలకు మోసం చేసేవారు అవుతారని జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులు నారగుట్టని సందర్శించండి ఒక్కసారి మేలుకోండి ఈ ప్రాంతాన్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇంత మంచి భూమిని క్రషర్ కి ఇవ్వటమేంది అనేది మీకే అవగాహన కలుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో JAC కోకన్వీనర్ పాక వెంకటేష్ యాదవ్ తుక్కాపూర్ సర్పంచ్ జనగాం పాండు నమాత్ పెళ్లి సర్పంచ్ అతికo అరుణ లక్ష్మీనారాయణ గౌడ్ మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్ కో కన్వీనర్స్ జనగాం సత్తయ్య నల్ల మాస కుమార్ గౌడ్ ఆంజనేయులు పెద్దిటి కొండల్ రెడ్డి ఉప సర్పంచ్ రసాల లింగస్వామి యాదవ్ ఎలకొండ సుధాకర్ రెడ్డి జక్కుల ఉప్పలయ్య మాజీ ఉపసర్పంచ్ ముంత సతీష్ యాదవ్ రత్నపురం సురేందర్ గొర్ల నరేష్ యాదవ్ వల్లపు సతీష్ యాదవ్ ఏడుమేకల మహేష్ యాదవ్ ఎలాకొండ శేఖర్ రెడ్డి రత్నపురం శ్రీకాంత్ జనగాo మహేష్ గోపగాని గ మహేందర్ రాసాల సురేష్ సంపత్ పేరబోయిన దుర్గ యాదవ్ వల్లపు భాను ప్రసాద్ రాసాల శివ ఎదునూరి సాయి నల్లమాసు సాయిరామ్ ముంత రాజు మాకోలు బాలకృష్ణ రాచకొండ ఓం ప్రతీష్ పిట్టల తిరుమలేష్ గోపగాని సతీష్ 4గ్రామాల సర్పంచులు మరియు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు ఉపసర్పంచ్లు వార్డ్ మెంబర్లు మాజీ ఉపసర్పంచ్ వార్డ్ నెంబర్లు నాలుగు గ్రామాల అన్ని పార్టీల నాయకులు ప్రజలు రైతులు యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రషర్ ని పూర్తిగా రద్దు మరియు రాబోయే రోజుల్లో ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా చర్చించడం జరిగింది.

నారగుట్టపై క్రషర్ అనుమతులు రద్దు చేయాలి JAC Read More »

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అవినీతి సిబ్బందిపై విచారణ జరిపించాలి!!

(SN. సింహ,తెలంగాణ స్టేట్ బ్యూరో) యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో లక్షల రూపాయలు అవకతవకలు జరిగినట్టు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఉదాహరణకు ఛాయా బిల్లులు ఐదేళ్ల కాలంలో 1,50,000 కాజే చేసినట్టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో బయటపడింది. కుక్కల పేరు మీద కోతుల పేరు మీద లక్షల రూపాయలు బిల్లులు పెట్టినట్లు తెలుస్తోంది? మాజీ శానిటైర్ ఇన్స్పెక్టర్ దండు కిరణ్ కుమార్, జవాన్ బూడిద కుమార్ వీళ్లే ఇద్దరు కలిసి రోడ్లపై మొరం పోసినట్టు మొరం బిల్లులు జెసిబి, ట్రాక్టర్ల బిల్లులు కలిపి ఆరు లక్షల 70 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. కుమార్ అనే వ్యక్తి మున్సిపల్ సిబ్బంది కాంట్రాక్టు దండు కిరణ్ అనే వ్యక్తి జూనియర్ అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్, మరియు నైట్ వాచ్ మెన్ బుగ్గ అంబేద్కర్, బిల్ కలెక్టర్ గారి నియమించుకొని లక్షల రూపాయలు కాజేసినట్టు తెలుస్తుంది వీటిపై ఇప్పటికైనా 10 ఏండ్ల కాలంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపైపవిచారణ జరిపించి బాధ్యులను సస్పెండ్ చేసి మరి ఇలాంటి ముందు జరగకుండా చూడాలని యాదగిరిగుట్ట ప్రజలు కోరుతున్నారు. నాలుగో భాగం కోతులపై కుక్కలపై నెక్స్ట్ స్టోరీ.. మీ ఇండియా న్యూస్ లో..

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అవినీతి సిబ్బందిపై విచారణ జరిపించాలి!! Read More »

యాదగిరిగుట్ట సర్కిల్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆక్షాన్స్ యాదవ ఐపీఎస్.

(SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో) యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ గారు నేడు యాదగిరిగుట్ట సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి, కార్యాలయ నిర్వహణ, పరిపాలనా విధానాలు, నేరాల నమోదు, దర్యాప్తు పురోగతి, వివిధ రిజిస్టర్లు మరియు ఇతర అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీ సందర్భంగా యాదగిరిగుట్ట సర్కిల్ పరిధిలోని తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూరు, గుండాల పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, బీట్ వ్యవస్థ, విజిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీ, కమ్యూనిటీ పోలీసింగ్, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలకు నమ్మకమైన సేవా కేంద్రంగా ఉండాలని, ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీ అనంతరం కార్యాలయ నిర్వహణపై పలు సూచనలు చేస్తూ, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి శాఖా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జోన్ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు యాదగిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ యాదగిరిగుట్ట సర్కిల్ పరిధిలోని తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూరు, గుండాల పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ అధికారులు మరియు సర్కిల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట సర్కిల్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆక్షాన్స్ యాదవ ఐపీఎస్. Read More »

నారగుట్టపై కన్నేసిన నాయకులు ఎవరు?

నారగుట్ట పై కన్నేసిన నాయకులు ఎవరు? (SN. సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో) యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామంలో నారాగుట్ట నాలుగు గ్రామాల ప్రజలకు పశువులకు మేకలకు వన్యప్రాణులకు కలప వృక్షం నారగుట్ట ఇక్కడ కొంతమంది కలిసి రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఈ గుట్టను క్రషర్ మిషిన్ ని ఏర్పాటు చేయాలని భువనగిరి నుండి ఢిల్లీ వరకు చేతులు కలిపినట్టు తెలుస్తుంది బడా పెట్టుబడిదారులతో పచ్చటి పల్లెల్లో క్రషర్ మిషన్ ఏర్పాటు చేయడంలో పంటలు నాశనం కావడమే కాకుండా క్రషర్ దుమ్ము ధూళితో ఇక్కడ గ్రామాల ప్రజలు రోగాలతో ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు ఏది ఏమైనా క్రషర్ మిషన్ అనుమతిని రద్దు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఇక్కడి ప్రజలేచ్చరిస్తున్నారు.

నారగుట్టపై కన్నేసిన నాయకులు ఎవరు? Read More »

బీబీనగర్ లో వృద్ధ దంపతులను మోసం చేసి బంగారు మంగళసూత్రం అపారించిన ఇద్దరు నిందితుల అరెస్టు స్టోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, భువనగిరి డివిజన్ డీఎస్పీ శ్రీ బి. రవీందర్ గారి పర్యవేక్షణలో బీబీనగర్ పోలీసులు చైన్ స్నాచింగ్ కేసును విజయవంతంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 241/2026, సెక్షన్ 304(2) బీఎన్‌ఎస్ కేసు వివరాల ప్రకారం, 2026 జూలై 12న బీబీనగర్‌కు చెందిన శ్రీమతి కుక్కడువు అందాలు (65) తన భర్తతో కలిసి ఇంటి వద్ద ఉండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమను ప్రభుత్వ ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, “ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పథకానికి సంబంధించిన ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంది” అంటూ నమ్మించారు. ఫోటో తీసేందుకు మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాన్ని తొలగించాలని చెప్పడంతో బాధితురాలు దానిని తీసి తన భర్తకు ఇచ్చింది. అదే సమయంలో నిందితులు బాధితురాలిని తోసివేసి, ఆమె భర్త చేతిలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని అపహరించి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బీబీనగర్ పోలీసులు, విశ్వసనీయ సమాచారం మేరకు 2026 జూలై 26న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. అరెస్టైన నిందితులు: నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నవి: నిందితుల మోసం చేసే విధానం: నిందితులు ప్రధానంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వ ఉచిత బియ్యం, పెన్షన్, కేవైసీ లేదా ఇతర సంక్షేమ పథకాల పేరుతో నమ్మకం కల్పించి, ఫోటో తీసేందుకు బంగారు గొలుసు లేదా మంగళసూత్రం తీసేయాలని చెప్పి, ఆభరణాలను అపహరించి పరారయ్యేవారని దర్యాప్తులో వెల్లడైంది. అలాగే, నిందితులపై ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, పెనుకొండ, గోరంట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసును ఛేదించడంలో బీబీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీ ఎన్. రమేష్, హెడ్ కానిస్టేబుల్ బి. అంజయ్య, పోలీస్ కానిస్టేబుళ్లు పి. శ్రీనివాస్, జి. జనార్ధన్, అలాగే భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కొండారెడ్డి, రమేష్ విశేష కృషి చేశారు. ప్రజలకు సూచనలు: యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో ఇంటికి వచ్చే గుర్తు తెలియని వ్యక్తులను నమ్మవద్దు. బంగారు ఆభరణాలను ఎవరికీ అప్పగించవద్దు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని సూచించారుPROYADADRI BHUVANAGIRI

బీబీనగర్ లో వృద్ధ దంపతులను మోసం చేసి బంగారు మంగళసూత్రం అపారించిన ఇద్దరు నిందితుల అరెస్టు స్టోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు Read More »

*భవానందపురం పాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య.

*భవానందపురం పాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య. Read More »

Scroll to Top