
(SN. సింహ,తెలంగాణ స్టేట్ బ్యూరో)
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో లక్షల రూపాయలు అవకతవకలు జరిగినట్టు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఉదాహరణకు ఛాయా బిల్లులు ఐదేళ్ల కాలంలో 1,50,000 కాజే చేసినట్టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో బయటపడింది. కుక్కల పేరు మీద కోతుల పేరు మీద లక్షల రూపాయలు బిల్లులు పెట్టినట్లు తెలుస్తోంది? మాజీ శానిటైర్ ఇన్స్పెక్టర్ దండు కిరణ్ కుమార్, జవాన్ బూడిద కుమార్ వీళ్లే ఇద్దరు కలిసి రోడ్లపై మొరం పోసినట్టు మొరం బిల్లులు జెసిబి, ట్రాక్టర్ల బిల్లులు కలిపి ఆరు లక్షల 70 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. కుమార్ అనే వ్యక్తి మున్సిపల్ సిబ్బంది కాంట్రాక్టు దండు కిరణ్ అనే వ్యక్తి జూనియర్ అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్, మరియు నైట్ వాచ్ మెన్ బుగ్గ అంబేద్కర్, బిల్ కలెక్టర్ గారి నియమించుకొని లక్షల రూపాయలు కాజేసినట్టు తెలుస్తుంది వీటిపై ఇప్పటికైనా 10 ఏండ్ల కాలంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపైపవిచారణ జరిపించి బాధ్యులను సస్పెండ్ చేసి మరి ఇలాంటి ముందు జరగకుండా చూడాలని యాదగిరిగుట్ట ప్రజలు కోరుతున్నారు. నాలుగో భాగం కోతులపై కుక్కలపై నెక్స్ట్ స్టోరీ.. మీ ఇండియా న్యూస్ లో..