భువనగిరి: భూమి విషయంలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న అన్నదమ్ముల మధ్య తగాదాలు చివరకు దారుణ హత్యకు దారితీశాయి. భూమి వివాదం నేపథ్యంలో అన్న, అతని కుమారుడు కలిసి తమ్ముడిపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.
ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం మరోసారి భూమి విషయంలో వివాదం తలెత్తింది.
వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో అన్న, అతని కుమారుడు కలిసి తమ్ముడిపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
భూమి కోసం మొదలైన వివాదం.. ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.


SN. సింహ క్రైమ్ ప్రతినిధి యాదాద్రి జిల్లా