IND News

పత్రికా ప్రకటనపీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో ఘనంగా తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ ముగింపు

(SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో )

భువనగిరి, ఆగస్టు 26, 2026: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో ఆగస్టు 24 నుండి 26, 2026 వరకు నిర్వహించిన తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ (Scouts) మూడవ రోజు ఆగస్టు 26న క్లోజింగ్ సెరెమనీ అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతంగా ముగించారు.
ఈ ముగింపు కార్యక్రమానికి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరి ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. చంద్ర మౌళి గారు అధ్యక్షత వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన శిబిరంలో వివిధ కేంద్రీయ విద్యాలయాల నుంచి వచ్చిన స్కౌట్స్ ఉత్సాహంగా పాల్గొని, తృతీయ సోపాన్‌కు సంబంధించిన వివిధ నైపుణ్యాలు, కార్యకలాపాలు మరియు పరీక్షల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ శిబిరానికి క్యాంప్ లీడర్ (LOC) శ్రీ ఆర్. జగన్మోహన్ రావు, ALT(S) నాయకత్వం వహించారు. ఆయన మార్గదర్శకత్వంలో శిబిర కార్యక్రమాలు క్రమశిక్షణతో, విజయవంతంగా కొనసాగాయి. ఎగ్జామినర్లు, ఎస్కార్ట్ టీచర్లు, స్కౌట్ లీడర్లు మరియు ఇతర సిబ్బంది శిబిర నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.
ముగింపు కార్యక్రమంలో వివిధ కేంద్రీయ విద్యాలయాల నుంచి పాల్గొన్న ప్రతి స్కౌట్ విద్యార్థికి ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. చంద్ర మౌళి గారు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులను అభినందిస్తూ, స్కౌటింగ్ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం, సమయపాలన మరియు దేశసేవా దృక్పథం పెంపొందుతాయని పేర్కొన్నారు.
శిబిరం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన క్యాంప్ లీడర్, ఎగ్జామినర్లు, ఎస్కార్ట్ టీచర్లు, స్కౌట్ మాస్టర్లు, పాల్గొన్న విద్యార్థులు మరియు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరి బోధన, బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. చంద్ర మౌళి గారు అభినందించారు.
మూడు రోజులపాటు ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగిన ఈ తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ విద్యార్థుల్లో “Be Prepared – Be Disciplined – Be Useful – Serve the Nation” అనే స్కౌట్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తూ విజయవంతంగా ముగిసింది.

                                                                                                               ప్రిన్సిపాల్

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top