IND News

తుర్కపల్లి పట్టణ MRPS కమిటీ ఎన్నిక

(SN. సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో ) ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పట్టణ ఎమ్మార్పీఎస్ కమిటీ ని తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం నియమవ్వాలి ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి యాదగిరి ఆధ్వర్యంలో తుర్కపల్లి ఎమ్మార్పీఎస్ పట్టణ కమిటీ నియమించడం జరిగింది . దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల ఉప్పలయ్య హాజరు కావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని మండల పార్టీ కమిటీలు మరియు గ్రామ కమిటీలు నియమించడం జరుగుతుంది ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ ఆధ్వర్యంలో ఏకతాటిపై తీసుకురావడం కోసం కృషి చేస్తానని చల్లూరి యాదగిరి భీమ వ్యక్తం చేశారు. ఇట్టి కమిటీలో కోట చరణ్ తేజ అధ్యక్షులు ఓటర్ కోట లింగస్వామి ఉపాధ్యక్షులు కోట పవన్ కుమార్ ప్రధాన కార్యదర్శి కోట చరణ్ మీడియా ఇంచార్జ్ గడ్డమీది విగ్నేష్ కార్యదర్శి గడ్డమీది వంశీ కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ కార్యవర్గ సభ్యులు కోట ధనుష్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

తుర్కపల్లి పట్టణ MRPS కమిటీ ఎన్నిక Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో పై ప్రజల్లో నమ్మకం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. రోగుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వారికి అందిస్తున్న చికిత్స, వైద్య సేవలు, మందుల పంపిణీ తదితర వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నెలలో ఎన్ని ప్రసవ అంచనా తేదీలు (EDD) ఉన్నాయని, ఇప్పటివరకు ఎన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగాయనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి గల కారణాలను తెలుసుకుని, వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్రిటికల్ డెలివరీల సంఖ్య, ఆయా గర్భిణీలకు అందిస్తున్న చికిత్స, తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ ఆరా తీశారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగాపర్యవేక్షించాలని, హైరిస్క్ ANCలను రిఫరల్ SOP ప్రకారం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు సకాలంలో రిఫర్ చేయాలని ఆదేశించారు. ప్రతి గర్భిణీని ప్రసవ సమయానికి ముందుగానే తగిన ఆరోగ్య కేంద్రానికి ట్యాగ్ చేసి, ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పై ప్రజల్లో నమ్మకం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి Read More »

పత్రికా ప్రకటనపీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో ఘనంగా తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ ముగింపు

(SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో ) భువనగిరి, ఆగస్టు 26, 2026: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో ఆగస్టు 24 నుండి 26, 2026 వరకు నిర్వహించిన తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ (Scouts) మూడవ రోజు ఆగస్టు 26న క్లోజింగ్ సెరెమనీ అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతంగా ముగించారు.ఈ ముగింపు కార్యక్రమానికి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరి ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. చంద్ర మౌళి గారు అధ్యక్షత వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన శిబిరంలో వివిధ కేంద్రీయ విద్యాలయాల నుంచి వచ్చిన స్కౌట్స్ ఉత్సాహంగా పాల్గొని, తృతీయ సోపాన్‌కు సంబంధించిన వివిధ నైపుణ్యాలు, కార్యకలాపాలు మరియు పరీక్షల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ శిబిరానికి క్యాంప్ లీడర్ (LOC) శ్రీ ఆర్. జగన్మోహన్ రావు, ALT(S) నాయకత్వం వహించారు. ఆయన మార్గదర్శకత్వంలో శిబిర కార్యక్రమాలు క్రమశిక్షణతో, విజయవంతంగా కొనసాగాయి. ఎగ్జామినర్లు, ఎస్కార్ట్ టీచర్లు, స్కౌట్ లీడర్లు మరియు ఇతర సిబ్బంది శిబిర నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.ముగింపు కార్యక్రమంలో వివిధ కేంద్రీయ విద్యాలయాల నుంచి పాల్గొన్న ప్రతి స్కౌట్ విద్యార్థికి ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. చంద్ర మౌళి గారు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులను అభినందిస్తూ, స్కౌటింగ్ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం, సమయపాలన మరియు దేశసేవా దృక్పథం పెంపొందుతాయని పేర్కొన్నారు.శిబిరం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన క్యాంప్ లీడర్, ఎగ్జామినర్లు, ఎస్కార్ట్ టీచర్లు, స్కౌట్ మాస్టర్లు, పాల్గొన్న విద్యార్థులు మరియు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరి బోధన, బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. చంద్ర మౌళి గారు అభినందించారు.మూడు రోజులపాటు ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగిన ఈ తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ విద్యార్థుల్లో “Be Prepared – Be Disciplined – Be Useful – Serve the Nation” అనే స్కౌట్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తూ విజయవంతంగా ముగిసింది.

పత్రికా ప్రకటనపీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో ఘనంగా తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ ముగింపు Read More »

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

జంగంపల్లిలో ప్రజలకు సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి గ్రామంలో సీఐ బొడ్డుపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం/క్రెడిట్ కార్డు సమాచారం, ఓటీపీ, పిన్ వంటి వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు, ఉద్యోగాలు, బహుమతుల పేరుతో జరిగే మోసాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు వివరించారు. సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను చాలా వరకు అరికట్టవచ్చని సీఐ బొడ్డుపల్లి భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. — SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం Read More »

భూమి తగాదాల మధ్య తమ్ముడి దారుణ హత్య

భువనగిరి: భూమి విషయంలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న అన్నదమ్ముల మధ్య తగాదాలు చివరకు దారుణ హత్యకు దారితీశాయి. భూమి వివాదం నేపథ్యంలో అన్న, అతని కుమారుడు కలిసి తమ్ముడిపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం మరోసారి భూమి విషయంలో వివాదం తలెత్తింది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో అన్న, అతని కుమారుడు కలిసి తమ్ముడిపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. భూమి కోసం మొదలైన వివాదం.. ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. SN. సింహ క్రైమ్ ప్రతినిధి యాదాద్రి జిల్లా

భూమి తగాదాల మధ్య తమ్ముడి దారుణ హత్య Read More »

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు..

(SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.. ముందుగా జనగామ డిసిసి కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు ఆవిష్కరించారు..

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు.. Read More »

భువనగిరిలో డ్రగ్స్ ఆపరేషన్ చేసిన పోలీసులు!

(SN సింహ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో ) యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు రెవిన్యూ లో….. ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ IPS ఆదేశాల మేరకు డ్రగ్స్ అక్రమ రవాణాపై యాదాద్రి-భువనగిరి పోలీసుల భారీ ఆపరేషన్ నిర్వహించారు. బీబీనగర్ పోలీసులు – SOT సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు నిందితుల అరెస్ట్ రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనంయాదాద్రి-భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ IPS గారి ఆదేశాల మేరకు, జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ తయారీ, రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా బీబీనగర్ పోలీసులు మరియు SOT యాదాద్రి-భువనగిరి పోలీసులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 27 కిలోల నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్‌ను, సుమారు రూ.54 కోట్ల విలువైన మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు 08.08.2026న కొండమడుగు గ్రామ శివారులో ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, MH-49-CW-1313 నంబర్ గల ఫార్చ్యూనర్ కారును పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. వాహనంలో 27 కిలోల మెఫెడ్రోన్‌తో పాటు డ్రగ్ తయారీలో ఉపయోగించే సుమారు 40 కిలోల అసిటోన్ లిక్విడ్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. A1. చేతన్ మధుకర్ మెష్రామ్, వయస్సు 49 సంవత్సరాలు, నాగ్‌పూర్, మహారాష్ట్ర.పాత్ర: డ్రగ్ తయారీకి ఆర్గనైజర్ మరియు ఆర్థిక సహకారం అందించిన వ్యక్తి. A2. ముజామల్ హక్, వయస్సు 25 సంవత్సరాలు, మారిగావ్, అస్సాం.పాత్ర: డ్రగ్ తయారీలో సహకరించిన వ్యక్తి. A3. ఆకాశ్ అశోక్ గవాండే, వయస్సు 31 సంవత్సరాలు, నాగ్‌పూర్, మహారాష్ట్ర.పాత్ర: డ్రగ్ అక్రమ రవాణాలో సహకరించిన వ్యక్తి. A4. ఉపద్రష్ట రమణ మూర్తి, వయస్సు 65 సంవత్సరాలు, చందానగర్, హైదరాబాద్.పాత్ర: వేటుకూరి ల్యాబ్స్ ఇన్‌చార్జిగా వ్యవహరించిన వ్యక్తి. పరారీలో ఉన్న నిందితులు: A5. ఎం.డి. అయూబ్ అలీ – అస్సాంల్యాబ్ ఏర్పాటు, ముడి పదార్థాల సమీకరణ మరియు కెమిస్ట్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర. A6. చందా ప్రదీప్ ఠాకూర్ – నాగ్‌పూర్డ్రగ్ పెడ్లర్. A7. గోపాల్ సిర్పట్ పటేలియా – నాగ్‌పూర్డ్రగ్ పెడ్లర్. A8. యేటుకూరి రామరాజు – వేటుకూరి ల్యాబ్స్ యజమాని, పీర్జాదిగూడ, మేడిపల్లిల్యాబ్ యజమాని. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్నవి: కేసు వివరాలు: నిందితులను విచారించగా, 05.08.2026 నుంచి 07.08.2026 వరకు కొండమడుగు గ్రామంలోని వేటుకూరి ల్యాబ్స్‌లో ఇతర సహచరుల సహకారంతో మెఫెడ్రోన్‌ను అక్రమంగా తయారు చేసినట్లు వెల్లడించారు. తయారు చేసిన డ్రగ్‌ను కొండమడుగు నుంచి నాగ్‌పూర్‌కు తరలించి అక్కడ పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల సమాచారం మేరకు పోలీసులు వేటుకూరి ల్యాబ్స్‌కు వెళ్లి తనిఖీ చేయగా, డ్రగ్ తయారీలో ఉపయోగించిన రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం కంపెనీని చట్ట ప్రకారం సీజ్ చేయడానికి చర్యలు తీసుకోబడతాయి. ఈ మొత్తం ఆపరేషన్‌ను NDPS చట్టంలోని నిబంధనలను పాటిస్తూ, పంచుల సమక్షంలో మరియు చట్టపరమైన విధానాలను అనుసరిస్తూ నిర్వహించారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ IPS సందేశం: “యాదాద్రి-భువనగిరి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ తయారీ, రవాణా మరియు విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం మనందరి బాధ్యత. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.” ఈ ఆపరేషన్ శ్రీ బి. శ్రీనివాస్ నాయుడు, SDPO–యాదాద్రి డివిజన్, ఇన్‌చార్జ్ భువనగిరి డివిజన్ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. ఆపరేషన్‌లో శ్రీ టి. ప్రవీణ్ బాబు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, SOT యాదాద్రి-భువనగిరి, శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శ్రీ ఎస్. కృష్ణయ్య, ఎన్. రమేష్, ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం యాదాద్రి-భువనగిరి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు..

భువనగిరిలో డ్రగ్స్ ఆపరేషన్ చేసిన పోలీసులు! Read More »

తాళ్ల గూడెంకు వచ్చిన నైజీరియా పక్షులు

తాళ్ల గూడెం కు వచ్చిన నైజీరియా పక్షులు 🐦 వలస పక్షులపై ప్రత్యేక కథనంపచ్చని చెరువులకు వలస పక్షుల సందడి.. ప్రకృతి ప్రేమికులకు కనువిందు!చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతుండటంతో వలస పక్షులు తెలంగాణ పల్లె ప్రాంతాలకు తరలివస్తున్నాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే ఈ పక్షులు చెరువుల వద్ద ఆహారం వెతుక్కుంటూ, కొంతకాలం ఇక్కడే గడుపుతున్నాయి.తెల్లని రెక్కలు, పొడవాటి కాళ్లు, రంగురంగుల ముక్కులతో కనిపించే పక్షుల గుంపులు చెరువులకు ప్రత్యేక అందాన్ని తీసుకొస్తున్నాయి. ఉదయం వేళ చెరువు పరిసరాల్లో పక్షుల కిలకిలారావాలు స్థానికులను, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.🌿 చెరువులే వాటికి ఆవాసంవలస పక్షులకు నీరు, చేపలు, చిన్న జీవులు, కీటకాలు వంటి ఆహారం లభించే ప్రాంతాలు ఎంతో కీలకం. చెరువులు, తడి భూములు ఆరోగ్యంగా ఉంటేనే ఇలాంటి పక్షులు ప్రతి సంవత్సరం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.🌏 పర్యావరణానికి సంకేతంవలస పక్షుల రాక ఒక ప్రాంతంలోని పర్యావరణ పరిస్థితులకు ముఖ్యమైన సూచికగా భావించవచ్చు. చెరువులను కాపాడటం, కాలుష్యాన్ని తగ్గించడం, పక్షుల ఆవాసాలను ధ్వంసం చేయకుండా చూడటం మనందరి బాధ్యత.“చెరువులను కాపాడుదాం.. వలస పక్షులను సంరక్షిద్దాం.. ప్రకృతిని పరిరక్షిద్దాం.” 🐦🌱

తాళ్ల గూడెంకు వచ్చిన నైజీరియా పక్షులు Read More »

ఆగస్టు 10న సాగర్ లో వరుణ యాగం!

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణ యాగం SN సింహ తెలంగాణ స్టేట్ బ్యూరో హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, కృష్ణా–గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవడంతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ ప్రాంగణంలో ఘనంగా వరుణ యాగం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి A. Revanth Reddy సూచనల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు యాగానికి ఆగస్టు 10వ తేదీని శుభముహూర్తంగా నిర్ణయించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహాయాగంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు వేదోక్త విధానంలో యాగ క్రతువులను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రజలకు సకాలంలో వర్షాలు కురవాలని, వ్యవసాయం అభివృద్ధి చెందాలని, నదులు, జలాశయాలు, చెరువులు నిండాలని ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి N. Uttam Kumar Reddy సారథ్యంలో ఈ వరుణ యాగం నిర్వహించబడుతుంది. సాయంత్రం జరిగే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

ఆగస్టు 10న సాగర్ లో వరుణ యాగం! Read More »

Scroll to Top